ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు, ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి శుక్రవారం మీడియాకు తెలియజేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 26న ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. దురదృష్టం కొద్దీ ప్రాంతీయ పార్టీలు మూడూ ఏపీని నాశనం చేశాయన్నారు. భారీ భహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మానిఫెస్టో తయారవుతోందని.. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా ఇవ్వన్ని మానిఫెస్టోలో ఉంటాయన్నారు.