సార్వత్రిక ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రక్రియలో కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నకుల్‌నాథ్ తన సోషల్ మీడియాలో బయోలలో కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించారు.