రానున్న సార్వత్రిక, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు 26 లక్షల సిరా బాటిళ్లు సిద్ధమవుతున్నాయి. 10 మి.లీ ఉండే ఒక బాటిల్ 700 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ బాటిళ్లను మార్చి 28లోపు సరఫరా చేయాలని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీకి ఎన్నికల సంఘం గడువు విధించింది.
దీంతో కేరళ, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా మొదలైంది. మార్చి 15 లోపు అన్ని రాష్ట్రాలకు సిరాను చేరుస్తామని కంపెనీ తెలిపింది.