'నారా'సుర వధకు జనం సిద్ధంగా ఉన్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. భీమిలి, దెందులూరు సభలతో టీడీపీ, చంద్రబాబుకు బుర్ర పని చేయటం లేదు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన ప్రభంజనంతో దూసుకు వెళ్తుండటంతో చంద్రబాబు ఖాళీ కుర్చీలతో పరాభవం చెందుతున్నాడు. డబ్బులు, మందుబాటిళ్లు, బిర్యానీలు, వాహనాలు ఏర్పాటు చేసి తీసుకు వస్తున్న జనాలను ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక.. ఆ ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు, లోకేశ్‌లు నోటికి పనిచెబుతున్నారు అని ఎద్దేవాచేశారు.