సాధారణంగా ట్రక్కుల వెనుక పెద్ద అక్షరాలతో ‘హార్న్ ఓకే ప్లీజ్’ అని రాసి ఉంటుంది. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా. అదేంటంటే.. ట్రక్కు వెనుక ఉన్న వాహనం ముందుకు వెళ్లే ముందు హారన్ మోగిస్తుంది.
ట్రక్కు డ్రైవర్‌కు తాను ఓవర్‌టేక్ చేయగలనని సూచిస్తాడు. అప్పుడు ముందు నుండి వేరే వాహనం రానప్పుడు, ఆ ట్రక్కు డ్రైవర్ ఓకే ఇచ్చి సూచిక ఇస్తాడు. దీని తర్వాత మాత్రమే వెనుక ఉన్న వాహనం ముందుకు వెళ్లాలని అర్థం.