అమెరికా కోర్టులో ఇటీవల అరుదైన పిటిషన్ దాఖలైంది. రిచర్డ్ బాటిస్టా, డోనెల్ దంపతులకు 1990లో పెళ్లైంది. కొన్నాళ్లకు డోనెల్కు రెండు కిడ్నీలు పాడయ్యాయి. భర్త రిచర్డ్ ఆమెకు కిడ్నీ దానం చేశాడు.
ఆరోగ్యం బాగైన తర్వాత భర్తకు డోనెల్ విడాకులిచ్చింది. దీంతో ఆమెకిచ్చిన కిడ్నీ తిరిగిప్పించాలని నాసావు కౌంటీ సుపీరియర్ కోర్ట్లో రిచర్డ్ పిటిషన్ దాఖలు చేశాడు. అది సాధ్యం కాదని రిచర్డ్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది.