పర్చూరు నియోజకవర్గంలో వైసిపి ప్రయోగాలకు అంతులేకుండా ఉంది. ఇప్పటి వరకు రెండు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా వైసిపి బోనీ కొట్టలేదు. మరోవైపు జగన్ టిడిపి అత్యంత బలంగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుగురు ఇన్ చార్జీలను మార్చారు. పార్టీ ఆవిర్భావం తదుపరి ఇప్పటికి గొట్టిపాటి భరత్, రావి రామనాథం బాబు( రెండుసార్లు) డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్, యడం బాలాజీలను పర్చూరుకి జగన్ పంపారు.