వైసీపీ పార్టీలో కొనసాగుతూ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి అధిష్టానం చేత సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారు.
ఈ విషయాన్ని నరసాపురం పట్టణ 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిలపు మురళీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను ఆయన కలిశారని, త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన అనుచరులతో పార్టీలో చేరబోతున్నారు.