అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా.. పోర్న్ వీడియోలు చూపించి తనతో అసహజ శృంగారం చేయాలని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గానికి బాధితురాలి అత్తా, మరిది కూడా వత్తాసు పలికారు.
ఈ ఘటన ఏపీలోని విజయవాడ జిల్లాలో చోటు చేసుకుంది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యువతికి కృష్ణా జిల్లా కూచిపూడికి చెందిన వ్యక్తితో 2021లో వివాహమైంది. అదనపు కట్నం తేవాలని, తన కోరికలు తీర్చాలని వేధింపులకు పాల్పడేవాడు. దాంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.