కబ్జా చేశానని నిరూపిస్తే నా ఆస్తులు మొత్తం రాసిస్తానని పాణ్యం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఈనాడు రామోజీకి ఛాలెంజ్ సవాలు చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే మేము నిరసన కూడా తెలపకూడదా? అని ప్రశ్నించారు. మేము తప్పులు చేస్తే ఎత్తిచూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాదన్నారు. 1991లో నాకు సంబంధం లేని విషయంలో బలిపశువుని అయ్యాను. రైతులకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా అన్నారు. రామోజీ తప్పుడు పనులు చేసినందునే సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని గుర్తు చేశారు. తప్పుడు పనులు రామోజీ చేస్తూ మాపై ఆరోపణలు చేయటం ఏంటి?. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదు అంటూ కాటసాని దుయ్యబట్టారు.