ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది 7వ సారి. అయితే గతంలో నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వడం ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే కేజ్రీవాల్ నోటీసులపై కోర్టును ఆశ్రయించారు.