మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ చేపట్టిన 'చలో సెక్రటేరియట్' కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయల్దేరారు.
తర్వాత ఉండవల్లిలోని కరకట్ట సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు.