సీఎం వైఎస్ జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని శనివారం మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ తెలియజేశారు. వైయస్సార్ ఆసరా పథకం మహిళల ఆర్థిక పరిపుష్టికి ఆసరాగా నిలుస్తోందన్నారు. శింగనమల నియోజకవర్గంలో వారు పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి రానున్న ఎన్నికలలో వైయస్సార్సీపీ గెలుపునకు సోపానాలన్నారు.