ప్రకాశం జిల్లాలో గ్యాస్ వినియోగదారుల నుండి డెలివరీ బాయ్స్, రవాణా చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏజెన్సీ షోరూమ్ నుండి వినియోగదారుల ఇంటి వరకు 15 కి. మీ లోపు దూరం ఉంటే ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ సిలిండర్లపై అధిక నగదు వసూలు చేస్తే సమాచారం ఇవ్వాలన్నారు.