వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధిగాంచిన నరసింహుని దివ్యక్షేత్రం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. శనివారం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాలకొండలో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది.