విజయనగరం 37వ డివిజన్ బీసీ కాలనీలో 82 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకును మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బిసి కాలనీ వాసులకు నేటి నుండి నీటి కష్టాలు తొలిగినట్లు అయిందని అన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని పంపిణీ చేస్తూ నీటి ఇక్కట్లను తొలగించగలిగామని చెప్పారు.