జిల్లాలోని గ్రూప్-2 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు ఆదివారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ వ్రాత పరీక్ష సందర్భంగా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పోలీసు అధికారులు, సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు కనీస సదుపాయాలు కల్పించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించారు