జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు, ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడైన ఉమర్ ఖలీద్ కోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టును రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించాడు. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబర్ నుంచి కస్టడీలు ఉన్నాడు. ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసుల స్పందనను కోర్టు కోరింది. బెయిల్ పిటిషన్‌ను మార్చి 11న విచారిస్తామని కోర్టు పేర్కొంది.