యూపీలోని ఝాన్సీ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి జరిగే సమయానికి వరుడు రాలేదు. దీంతో వధువు మెడలో వరుడి సోదరుడు మంగళసూత్రం కట్టాడు. అయితే దీనిపై అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మాస్ మ్యారేజ్ స్కీమ్ కింద యూపీ ప్రభుత్వం ఇచ్చే రూ.51 వేల కోసం వధులు ఇలా చేసిందని తేలింది. డబ్బు కోసమే ఆమె ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో అధికారులు అవాక్కయ్యారు.