సీఎం జగన్ వైసీపీ సీనియర్ నేతలతో నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని సమాచారం.
మహిళల కోసం కొత్త పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa