గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ముద్దనూరు మండల పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం. కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొత్తపల్లె వద్ద మతిస్థిమితం లేని గుర్తుతెలియని వృద్ధుడు (55) రహదారిపై వెళ్తుండగా వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.