రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టకున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చారన్నారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన తెలిపారు. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చామని చెప్పారు.