విశాఖ తూర్పు నియోజవర్గంలో వాలంటీర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, చీరల పంపిణీపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చిల్లర పనులకు వైసీపీ చీటర్లు పాల్పడుతున్నారన్నారు. ‘‘గెలవరని గుర్తించిన వైసీపీ నాయకులు ఓటర్లకు తాయిలాలు పంచుతున్న వాలెంటీర్లు. విశాఖ తూర్పు నియోజకవర్గం వెంకోజీపాలెం గుడి దగ్గర వాలెంటీర్ల ద్వారా ఓటర్లకు చీరలు పంచుతూ దొరికిపోయిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నాయకులు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న సొమ్మంతా వైజాగ్ ప్రజల నుంచి దోచిందే. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పనులు చేయడం సిగ్గుచేటు. ఎన్ని తాయిలాలు పంచినా గెలిచేది టీడీపీ, జనసేన కూటమే, వైసీపీ తప్పదు ఓటమి’’ అంటూ ప్రణవ్ గోపాల్ ట్వీట్ చేశారు.