లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు, నేతలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగరాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదని పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు