భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను అంతరిక్షంలోకి పంపిన రోజే ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సోమనాథ్ స్వయంగా వెల్లడించారు. స్కానింగ్‌లో ఈ విషయం తెలిసిందన్నారు. అయినప్పటికీ కీలకమైన చంద్రయాన్-3 మిషన్, ఆదిత్య-ఎల్1 మిషన్లను సక్సెస్ అయ్యేందుకు ఆయన ఎంతో శ్రమించారు.