ఎన్టీ రామారావు ప్రభుత్వాన్నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత? అని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని అన్నారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు ఓట్లు కావాలి... కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకోలేదు...175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడు. జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్‌కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు అని కొడాలి నాని అన్నారు.