ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రులు విడదల రజిని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు స్వాగతం పలికారు. కాసేపట్లో విజన్ విశాఖ సహా పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్.
-రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సు
-2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం
-అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం
-వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం
-జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం వైయస్ జగన్
-స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే భవిత కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్
-మధురవాడ వీ కన్వెన్షన్ సెంటర్‌లో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
-పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థుల తో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
-ముడసర్లోవలో జీవీఎంసీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
-10 కోట్ల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న టర్టెల్ పార్క్ నిర్మాణ పనులకు సీఎం చేతుల మీదుగా శ్రీకారం
-వెంకోజిపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం
-కణితిబ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడకు మంచినీటి సరఫరా పథకంకి శంకుస్థాపన చేయనున్న సీఎం
-అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్న సీఎం వైయస్ జగన్