తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తల్లి పొలం పనులకు వెళ్లాక ఒంటరిగా ఉన్న బాలికపై శ్రీరాములు (60) అనే వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు