భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీడ్ లోడ్ కావడం లేదు. దీనిపై నెటిజన్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు ఫేస్‌బుక్ కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సాంకేతిక సమస్యలపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు అధికారకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫేస్‌బుక్ సైట్ నుండి ప్రతి ఒక్కరి ఖాతా ఆటోమేటిక్‌గా లాక్-అవుట్ కావడంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa