ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం తగ్గించింది. రెండు సంవత్సరాల గరిష్ట పరిమితిని ఒక ఏడాదికి తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏసీబీ, ఇతర విభాగాల విచారణ సస్పెన్షన్ కేసులపై 4 నెలలకు ఒకసారి సమీక్ష చేయాలని పేర్కొంది. అన్ని విభాగాలు, కలెక్టర్లు ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.