ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో సంస్థపై ఆర్‌బీఐ ఆంక్షలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 11:51 AM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి రుణాల మంజూరు, పంపిణీకి సంబంధించి ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ కంపెనీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
తాజాగా షేర్లు, డిబెంచర్లపై ఎలాంటి రుణాలనూ అందించకుండా జేఎం ఫైనాన్షియల్‌ ప్రోడక్ట్స్‌పై కూడా ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఐపీఓ, ఎన్‌సీడీల కోసం రుణాలను ఇవ్వడంలో కొన్ని తీవ్ర లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com