ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఓ యువకుడు ఇంటి పైకప్పుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిలమత్తూరు ఎస్. ఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కందూరుపర్తికి చెందిన మధువర్దన్రెడ్డి (23) బుధవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, వేదావతిలకు రెండో సంతానం. బుధవారం కందూపర్తికి వచ్చి తన సొంతింట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.