విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తుండగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని మరికొందరు అంటున్నారు.