రష్యాలోని తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు చేసింది. మాస్కోలోని రద్దీ ప్రాంతాలు, జన సమూహాలకు దూరంగా ఉండాలని, తీవ్రవాదులు దాడికి ప్లాన్ చేశారని రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. తక్షణమే రష్యాను విడిచిపెట్టాలని పదేపదే కోరిన రాయబార కార్యాలయం.. ముప్పు స్వభావం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, గుమిగూడి ఉండొద్దని, చుట్టూ పరిసరాల గురించి గమనించాలని సూచించింది.
మాస్కోలో జనసమూహాలు,కచేరీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తీవ్రవాదులు కుట్రలు చేశారన్న నివేదికలను పర్యవేక్షిస్తోంది.. రాబోయే 48 గంటల్లో పెద్ద సమావేశాలకు దూరంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచిస్తున్నాం’ అని రాయబార కార్యాలయం తన వెబ్‌సైట్‌లోని పేర్కొంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర.. 1962 క్యూబా సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలలో లోతైన సంక్షోభాన్ని రేకెత్తించింది. ఉక్రెయిన్‌కు సాయంగా పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపితే అణు యుద్ధాన్ని ఎదుర్కొక తప్పదని పుతిన్ హెచ్చరించారు. అమెరికాతో సంబంధాలు ఎన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉన్నట్టు మాస్కో పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఆర్ధిక, ఆయుధాలు, తెలివితేటలతో మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతోందని మండిపడింది.