విశాఖ వాసులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని భువనేశ్వర్ లేదా ఖుర్దా రోడ్ నుంచి విశాఖ వరకు నడపనున్నారు.
ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి కాగా ఈ నెల 12న ప్రధాని మోదీ దీనిని వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాగా దీని టైం, ఏయే స్టేషన్ల మధ్య ఆగుతుందనే వివరాలపై స్పష్టత లేదు. ఈ వందేభారత్ నలుపు-ఆరెంజ్ రంగులో ఉండనుంది.