శివరాత్రి సందర్భంగా శుక్రవారం కొందరు పోకిరీలు రాళ్లు-ఇటుకలతో దాడులకు తెగబడ్డారు. రాయదుర్గంలోని దబ్బడీ కాంప్లెక్స్ వద్ద సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ ఇంటిపై రాళ్లు విసిరి పరారయ్యారు. ఇంటి తలుపులపై ఇటుకలను, రాళ్లను విసరడంతో శబ్దానికి లేచి చూడగా ఐదుగురు యువకులు పరిగెత్తుతూ కనిపించారు. ఘటనపై పోలీసులకు శనివారం బాధితుడు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రాత్రిళ్లు గస్తీ నిర్వహించాలన్నారు.