రైల్వేకోడూరు మండలం రాఘవరాజు పురం నందు 18 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు, ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, సర్పంచ్ ఆర్వీ రమణ, జడ్పిటిసి రత్నమ్మ పాల్గొన్నారు.