ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వెంట రఘురామను అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లలేదు. సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని రఘురామ కాల్స్ మీద కాల్స్ చేశారట. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదని సమాచారం. దాంతో చేసేదేం లేక రఘురామ వారు వచ్చేంత వరకు గేటు బయటే నిలబడినట్లు తెలుస్తోంది.