బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ ఆదివారం ఎర్రగొండపాలెం రానున్నట్లు ఆ పార్టీ మండల నాయకులు శనివారం తెలిపారు. వినుకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సభ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 10వేల మంది పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa