పొత్తు కుదిరిన వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పొత్తులో భాగంగా కొన్ని చోట్ల జనసేన, బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తోంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలవరం టికెట్ కోసం టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆ సీటు జనసేనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థికి సీటు ఇస్తే తాము మూకుమ్మడి రాజకీయాలు చేస్తామంటూ టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.