యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం స్థానికంగా బాస్ఖారీ స్టేషన్ పరిధిలో ఉంటోంది.
ఆ కుటుంబంలోని మహిళకు అనారోగ్యంగా ఉండడంతో వారు మహ్మద్ అష్రఫ్ (50) అనే భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. మహిళ భర్తను, అత్తను బయట ఉండమని అష్రఫ్ చెప్పాడు. అనంతరం బాధిత మహిళను లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.