తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు.
ఇవాళ లాంచ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు మహిళల వివరాలు పొందపరచామని, అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఈ పథకం రూపొందించామని వైఎస్ షర్మిల ట్విట్టర్లో తెలి పారు.