నరసన్నపేట మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం పట్టణంలోని స్థానిక మారుతి నగర్ ఒకటవ వీధిలో సిసి రోడ్డు నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం తో పాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు కూడా చేస్తున్నామని అన్నారు. ఈ రహదారి అభివృద్ధి చెందితే 25 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.