తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది చనిపోయారు. మరో 78 మంది ఆస్పత్రిలో చేరారు. అక్కడి జాంజిబార్ సముద్ర దీవుల్లో సముద్రపు తాబేలు మాంసాన్ని చాలా రుచిగా తింటారు.
కానీ తాబేళ్లలో కిలోనిటాక్సిజం అనే రసాయన ఆహార విషప్రయోగం మరణానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తినవద్దని హెచ్చరించారు.