అల్-ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతి చెందాడు. ఈ విషయాన్ని మిలిటెంట్ గ్రూప్ ఆదివారం ప్రకటించింది. అతడి మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
అల్-ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపుతూ వీడియో విడుదల చేసింది. అతడిపై దాదాపు రూ.40 కోట్ల రివార్డు ఉంది. బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా యెమెన్ శాఖ అవతరించింది.