పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు సమీపంలో వెలసిన అశ్వర్థనారాయణ స్వామి క్షేత్రంలో మాఘమాసం ఐదో ఆదివారం తిరుణాల కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నారాయణస్వామి, చక్రభీమలింగేశ్వరుడి చుట్టూ నారాయణ స్వామి శిరసాస్మరామి అంటూ ప్రదక్షిణలు చేశారు. కోర్కెలు నెరవేరిన భక్తులు స్మామి వారికి ముడుపులు, కానులకలతో పాటు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.