మొటిమలు కాని ఒంటిమీద మరెక్కడైనా ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక గుప్పెడు లేత వేపాకులలో చిటికెడు పసుపు కలిపి గ్రైండ్ చేసి సమస్య ఉన్నచోట రాయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఇదే మిశ్రమాన్ని ఐదు గ్రాముల చొప్పున కడుపులోకి తీసుకుంటే జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ ను అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొందరికి కళ్ల చుట్టూ ఏర్పడే ముడతలతో బాధపడుతున్నారు. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా డాక్టరు సూచించిన మేరకు రీడింగ్ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు.