వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..పేరుతో వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. అవతలి వైపు మూడు పార్టీలు కాదు..30 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా ..ఎన్ని ఎత్తులు, పొత్తులతో ముందుకు వచ్చినా కూడా మా నాయకులు వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు.