ముస్లిం సోదరులకు రంజాన్ అనేది ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగను ముస్లింలు అంతా భక్తిశ్రద్ధలతో, అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. నెలవంక ఆకారంలో చంద్రుడు కనిపించాక ఈ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. నెలరోజులపాటు ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సుర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ మాసంలో ఓ వైపు ఉపవాసాలు, మరోవైపు ఖురాన్ పఠనంతో మనస్సు, శరీరం, ఆత్మ అన్ని పరిశుద్ధమవుతాయి.