కందుకూరు పట్టణ నడిబొడ్డున వేంచేసియున్న గ్రామ దేవత, ఆదిపరాశక్తి శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని కందుకూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. స్థానిక శాసనసభ్యులు మహిధర్ రెడ్డి శ్రీ అంకమ్మ తల్లి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు.